సరదాగా నవ్వుకోండి

ఖ-క…. లకు ఎంత తేడా వుందో చూడండి…. తెలుగు భాష గొప్పతనం గుర్తించండి.
లాయర్ : మీ వివాహానికి కారణం?
ఆనంద్ : *ప్రేమలేఖ*
లాయర్ : మరి ప్రేమించి పెళ్ళి చేసుకొని.. ఇప్పుడు విడాకులెందుకు?
ఆనంద్ : *ప్రేమలేక*

*ప్రసాద్* : ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా!
*మురళి*: ఏమిటవి?
*ప్రసాద్*: పక్కింటివాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొనాలి. లేదా వాళ్ళ దగ్గర లేవు కనుక మనం కొంటే గొప్పగా ఉంటుందని కొనిపిస్తుంది.

*భర్త : అదేంటీ.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక్క అరుంధతిని మాత్రమే చూపించాడు….!!*
*భార్య : మిగతా నక్షత్రాలన్నీ రేపటి నుండి నేను చూపిస్తానుగా…!!*

*టీచర్:* _”సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి?”_

*స్టూడెంట్:* _”భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!”_

ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే *”ఈమెయిల్”*అయినా ఉండాలి లేదా *”ఫీమేల్”* అయినా ఉండాలి.
రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.!..

*పెళ్ళి* అంటే ఏంటో కుతూహలంతో ఒక *శాస్త్రవేత్త* పెళ్లిచేసుకున్నాడు … కొంతకాలం తర్వాత అతనికి అర్ధమయ్యింది …
*శాస్త్రవేత్త* అనేవాడు అందరికీ పనికొచ్చే ప్రయోగాలు చేయాలి కానీ , పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకూడదని..

ఈ భూమ్మీద ….
రెండే రెండు వింతలు చెప్పుకోదగ్గవి !!!!
1 . *మద్యపానం*…
ఎంతటి మితభాషి నైనా…
మాట్లాడేటట్టు చేస్తుంది!!!
2 . *భార్య* …
ఎంతటి ఘనుడినైనా…
మూగవాని గా మార్చేస్తుంది !!!!!

దొంగ .. పోలీసుతో ఇలా..
*దొంగ* : మా కష్టాలు ఏమి చెప్పమంటారు..ఈ పెళ్ళిల సీజన్లలో 20 చైన్లు లాగితే 18 గిల్టు చైనులు ఉంటున్నాయి …

నేను బస్ లో వెళ్తున్నా..
నా ముందు నిల్చున్న అబ్బాయి
మొబైల్ లో జాతీయ గీతాన్ని పెట్టాడు ….
నేను లేచి నిల్చున్నా..
యెదవ నేను నిల్చోగానే సాంగ్ ఆఫ్ చేసి నా సీట్ లో కుార్చున్నాడు….