Rishi Sunak G20 India : ‘సరైన టైమ్కే
జీ 20లో భారత్, అమెరికా, రష్యా, చైనా సహా 19 దేశాలు ఇంకా యూరోపియన్ యూనియన్ భాగంగా ఉంటాయి. అంతే కాదు వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేట్ ఆర్గనైజేషన్, ఆఫ్రికా యూనియన్ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటాయి. ఈ దేశాలన్నీ కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలి అని ఏడాదికోసారి ఓ అజెండాను రూపొందించుకుంటాయి. ఈ అజెండా ప్రకారం జీ20 నడిపించాల్సిన బాధ్యత అధ్యక్షుడి మీద, ప్రెసిడెన్సీ కంట్రీ మీద ఉంటుంది. తాజాగా జరిగిన సమావేశం చివరిరోజు ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే…
Rishi Sunak G20 India Presidency : జీ20 సదస్సు నిర్వహించేందుకు సరైన సమయంలో సరైన దేశానికి అవకాశం లభించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని రిషి సునాక్ చెప్పారు..ఇరువురు నేతల మధ్య భేటీతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాలు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి..బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అభినందించారు. రిషితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు.