జీ20 దేశాల సదస్సుకు ప్రధాని మోడీ.. కీలక ప్రసంగం… ..

మన దేశంలో శక్తిరంగం భద్రతకు సంబంధించి కూడా ఓ సెషన్ లో కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని జీ20 దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు.

భారత్ లో శక్తి రంగం భద్రతకు ప్రపంచ దేశాలు హామీ ఇవ్వాల్సి ఉంటుందని జీ20 సదస్సులో ప్రధాని మోడీ కోరారు.

ప్రపంచ వృద్ధికి భారతదేశం యొక్క ఇంధన-భద్రత చాలా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.

భారత్ లో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షల్ని ప్రోత్సహించవద్దని మోడీ కోరారు. ఇంధన మార్కెట్‌లో స్థిరత్వం రావాలని ఆయన సూచించారు. అదే సమయంలో స్వచ్ఛ ఇంధనం, పర్యావరణం పట్ల భారత దేశ నిబద్ధతను మోడీ గుర్తుచేశారు. 2030 నాటికి భారతదేశ విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి చేయబోతున్నట్లు మోడీ హామీ ఇచ్చారు..అంతర్జాతీయంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా భారత్ లో కర్బన ఉద్గారాల్ని కూడా తగ్గించుకోవాల్సిన పరిస్దితి ఉంది. దీంతో ఈ ప్రభావం సహజంగానే ఇంధన రంగంపై పడుతోంది. ముఖ్యంగా ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల పెరుగుతున్న కర్బన ఉద్గారాలతో భారత్ కు ఆంక్షలు తప్పడంలేదు. ఈ విషయంలో తమకు సహకరించాలని ప్రధాని మోడీ ఇవాళ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. తద్వారా భారత్ ప్రపంచ ఆర్ధిక చిత్రపటంలో పుంజుకునేందుకు వీలు కలుగుతుందన్నారు..