పాక్‌కు మరో షాక్. జీ7 దేశాలు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు…

జమ్మూకాశ్మీర్, పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు.. పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలి తలచటం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మధ్యలో కలుగజేసుకోమంటూ స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బ తింటున్న పాక్‌కు మరో షాక్ తగిలింది. జీ7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి. యుద్ధం విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని తెలిపాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చుని శాంతియుతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని విజ్ణప్తి చేశాయి. తాము యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటామని అన్నాయి..జీ7 దేశాలు పాకిస్థాన్ తీరును తప్పు పట్టడంతో పాటు యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వంపై భారీ దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. తాము ఇరు దేశాల ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. రెండు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని, కూర్చుని శాంతియుతంగా చర్చించుకునే ప్రయత్నం చేయాలని కోరాయి.

ఏప్రిల్ 22 విషాదం..

2025, ఏప్రిల్ 22.. పాకిస్తాన్‌ వినాశనానికి కారణమైన రోజు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్చేశారు. మొత్తం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసేశారు. దీంతో భారత్ ముందెన్నడూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ తుక్కురేపుతోంది.