బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరుగా టచ్‌లో ఉన్నారు…విశ్లేషకుడు గాదె ఇన్నయ్య.

బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరుగా టచ్‌లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటుచేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య చెప్తున్నారు.రేవంత్‌ సర్కారు పాల’పొంగు’లాంటిదేనని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కూలటం ఖాయమనే పక్కా సమాచారం ఉన్నదని అంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ‘ఆపరేషన్‌ తెలంగాణ’పై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని, రోజుల వ్యవధిలోనే కేజ్రీవాల్‌ అరెస్టుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైనట్టు తనకు సమాచారం ఉన్నదని తెలిపారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు. ఇంకా పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలపై ‘నమస్తే తెలంగాణ’తో గాదె ఇన్నయ్య పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ లక్ష్యంగా ప్రారంభమైన ఢిల్లీ మద్యం వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ నుంచి డిమాండ్‌ వచ్చింది. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది.. ప్రజలు బీజేపీని నమ్మాలంటే కవితను అరెస్టు చేయాలని బండి సంజయ్‌, అరవింద్‌ వంటి వారితో పాటు అనేక మంది అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు.

కానీ పైనుంచి మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్‌ చేస్తే బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నందున పెద్దఎత్తున సానుభూతి వస్తుందని వారించింది. చివరకు అప్పట్లో బీజేపీతో సంప్రదింపులు చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తాను చేరేందుకు ఇదే షరతు విధించారు. కానీ బీజేపీ హైకమాండ్‌ ససేమిరా అన్నది. పార్టీలోకి ఎవరు వచ్చినా, రాకున్నా అరెస్టు చేసేది లేదని తేల్చిచెప్పింది..

ఐదారు నెలలు పొంగులేటి సంప్రదింపులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దాదాపు ఐదారు నెలల పాటు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో ఆయన ఆ పార్టీలోకే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో పొంగులేటి కవిత అరెస్టు డిమాండ్‌ను బీజేపీ ముందుంచారు. ఆ పార్టీ పెద్దలు అది కుదరదని చెప్పేశారు. కనీసం కాళేశ్వరం అక్రమాలంటూ అప్పటి సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేయాలని కోరారు. కానీ అది మొదటికే మోసం వస్తుందని, కేసీఆర్‌ లాంటి ఉద్యమకారుడిని టచ్‌ చేస్తే బూమరాంగ్‌ అవుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పొంగులేటి మనసు మార్చుకున్నారు. ఇదే కారణాన్ని చూపి బీజేపీలో చేరేందుకు నిరాకరించారు..ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఎవరికివారు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గేమ్‌ ప్లాన్‌లో అసలైన సెకండాఫ్‌ను మొదలు పెట్టనున్నది. అయితే ఇందులో అటు రేవంత్‌? ఇటు పొంగులేటి? ఎవరిని ఎంచుకోవాలనే దానిపై ఆ పార్టీ పెద్దల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చినట్టు లేదు. రేవంత్‌రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలు, పొంగులేటి 12 మంది ఎమ్మెల్యేలు.. మద్దతు ఉన్నట్టుగా బీజేపీకి చెప్పుకున్నట్టు తెలిసింది.

ఎలాగూ బీజేపీకి 8 మంది ఉన్నారు. వీటితో గేమ్‌ను మొదలుపెడితే అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు వరదలా వచ్చిపడతారనే అంచనాతో బీజేపీ ఉన్నది. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే వాళ్ల దాడి ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు. ఏకంగా 16 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక తిరుగేముంది? ప్రతిపక్షాలు ఢీలా పడతాయి. ఇందులో రేవంత్‌రెడ్డికి మొదటి ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయననుఇందులో రేవంత్‌రెడ్డికి మొదటి ఆప్షన్‌ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయనను పెద్దగా నమ్మటం లేదు. పొంగులేటి ఇప్పటికే ఐదారు నెలల పాటు టచ్‌లో ఉండటంతో పాటు కాంట్రాక్టర్‌, వ్యాపారవేత్త అయినందున తమ కనుసన్నల్లో ఉంటాడనే నమ్మకం బీజేపీ పెద్దల్లో ఉన్నది..