మల్లు రవికి గాంధీభవన్‌లోకి నో ఎంట్రీ!..

మల్లు రవికి గాంధీభవన్‌లోకి నో ఎంట్రీ!
కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను పోలీసులు గాంధీభవన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. గాంధీభవన్‌ వర్గాలు ఇచ్చిన జాబితా ప్రకారమే నేతలను లోపలికి అనుమతించగా, ఆ జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో పోలీసులు ఆయనను లోపలికి పంపలేదు. దీంతో ఆయన పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తననే అడ్డుకుంటారా? అని హంగామా చేయటంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీభవన్‌లోకి అనుమతించని పార్టీ ఇతర నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చాక తమను గేటు వద్దే ఉంచేస్తారా? అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు….
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు గాంధీభవన్ లోనికి అనుమతించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కాంగ్రెస్ వార్ రూమ్ నడిపి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మల్లురవి కీలక పాత్ర పోషించారు..