హైదరాబాద్
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం చోటు చేసుకుంది..
గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని కవరేజ్ కోసం వచ్చిన ప్రముఖ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహిరుద్దిన్ అలీఖాన్ తోపులాటలో చిక్కుకొని మృతిచెందారు…
గద్దర్‌ను కడసారి చూడటానికి భారీగా అభిమానులు, కళాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఒక్కసారిగా జనాలు పెరగడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కిందపడిపోయిన జహీరుద్దీన్‌కు ప్రాథమిక చికిత్స చేసి.. ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. ఈయన కూడా తెలంగాణ కళాకారుడే. గద్దర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు…