ప్రజాగాయకుడు గద్దర్ కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తన పార్టీ రిజిస్ట్రేషన్ గురించి గద్దర్ మాట్లాడారు. అంతకుముదు తెలంగాణ, ఏపీ భవన్ లోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ సీఎం కేసీఆర్ పాలనపై ఫైర్ అయ్యారు.
తెలంగాణలో దోపిడోళ్ల పార్టీ పోయేందుకే ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో ముందుకొస్తున్నట్లు తెలిపారు. దొరల రాజ్యం వద్దని తెలంగాణ సాధించుకున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదన్నారు. తెలంగాణలో కనీసం ప్రజలకు జీవించే హక్కు లేకుండా పోయిందన్నారు. దొరల పాలన పోయి ప్రజా పాలన కోసం పార్టీ స్థాపించానన్నారు.