ప్రజా గాయకుడు గద్దర్ మృతి..

*ప్రజా గాయకుడు గద్దర్ మృతి*..

ఉవ్వెత్తిన ఎగసేపాడిన తెలంగాణ ఉద్యమానికి ఆయన పాటే ఒక ఆయుధంగా మారింది..
జై తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు పై నడుస్తున్న కాలమా అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గాయకుడు గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణించిన వార్తను కొడుకు సూర్యం ధృవీకరించారు. 1949లో తూఫ్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు విఠల్ రావు. తన పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు గద్దర్. గద్దర్ మరణంతో తెలంగాణ ప్రజానీకం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం ఆపరేషన్ సక్సెస్ అయినట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే..