గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నేనెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు
నేను BRS పార్టీ లైన్లోనే ఉన్నా-కృష్ణమోహన్‌రెడ్డి.
స్పీకర్ నోటీస్‌కు సమాధానం ఇచ్చా
సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచా
నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు.
కేసీఆర్‌ను గౌరవించేవారిలో నేను మొదటి వ్యక్తిని
అభివృద్ధి లేకుండా ప్రజలను ఓట్లు అడగలేం.
పార్టీల కన్నా గద్వాల అభివృద్ధే ముఖ్యం…
పార్టీ ఫిరాయించిన కేసులో ఇటీవల స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (Gadwal MLA Krishnamohan Reddy) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి తప్పు చేశానని తెలిపారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గంలో పనులు జరుగుతాయని భావించి పార్టీ మారినట్లు చెప్పారు.
కాంగ్రెస్‌లో (Congress) ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ వస్తోందని వ్యాఖ్యానించారు. అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారానన్న కృష్ణామోహన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి (constituency development) కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్‌లో ఉంటే కిరాయి ఇంట్లో ఉంటున్నట్లు అనిపిస్తుందన్నారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో (Harish Rao) తాను రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉన్నానని చెప్పారు. స్పీకర్ నోటీసులు వచ్చాయని, సమాధానం కూడా ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్లోనే (BRS Party) ఉన్నానని, అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన సమాధానంలో తెలిపానన్నారు…