ఓర్నీ మీ దుంపతెగ,, గల్లీలో వినాయకుని చోరీ చేస్తారా..!!

నగలు పూరి చేయడం,, కుండీ దొంగతనాలు చేయడం,, మరి కొద్దిగా లడ్డు రెండు దొంగతనం చేయడం కూడా చూశాను కానీ ఇది అన్నిటికీ భిన్నంగా ఉన్న దొంగతనం.. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కేంద్రంలో గత ఏడు రోజుల నుండి పూజ అందుకుంటున్న వినాయక ఉత్సవ విగ్రహం చోరీకి గురైనట్లు తెలిపారు. మంగళవారం కురువ కాలనీకి చెందిన గల్లి వినాయకుడు వద్ద గ్రామానికి చెందిన యువకులు మద్యం మత్తులో ఎత్తికెళ్ళినట్లు గుర్తించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో చిన్నారులు గత ఏడు రోజుల నుండి పూజలు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం ఏర్పాట్లు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైనది. గణపతి విగ్రహంను ఎత్తుకెళ్లిపోవడంతో చిన్నారులు అయోమయంలో పడ్డారు. సంఘటన పై బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.