గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక….

గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక..

దేవరకొండ పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక ఆదివారం స్థానిక వాసవి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా నీల రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజేష్ కోశాధికారిగా నేతల వెంకటేష్ ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ పానుగంటి మల్లయ్య చీదెళ్ల వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు నీల పాండురయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించిన నక్క వెంకటేష్ సభ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా అధ్యక్షులు నీల రవికుమార్ మాట్లాడుతూ దేవాలయాలు ఇతర వార్డులలో ఏర్పాటుచేసే గణేష్ విగ్రహాల నిర్వహణ శోభయాత్ర రూట్ మ్యాప్ పై గణేష్ ఉత్సవ కమిటీ పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. శోభాయాత్రలో ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా గణేష్ శోభయాత్ర నిర్వహించడానికి కమిటీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. నూతన కమిటీగా తమకు బాధ్యతలు అప్పజెప్పిన పుర ప్రముఖులకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు .గతంలో ఈ కమిటీ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని ప్రస్తుతం కమిటీ పెద్దలతో అందరిని కలుపుకొని గణేష్ ఉత్సవ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మరో మారు గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం అవుతామని ఆయన తెలిపారు ఇందుకోసం పోలీస్ పురపాలక విద్యుత్తు తదితర ప్రభుత్వ శాఖల సహకారం అందించాలని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ పానుగంటి మల్లయ్య పగిడిమర్రి రఘురాములు గాజుల రాజేష్ నక్క వెంకటేశ్ యాదవ్ చిలువేరు చంద్రమౌళి చిదేళ్ళ వెంకటేశ్వర్లు సురభి కృష్ణమూర్తి వనం జగదీశ్వర్ పులిజాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.