వినాయక నిమజ్జనంలో విషాదం..!

వినాయక నిమజ్జనంలో విషాదం.

ఒడిశాలోని కటక్లో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా వాహనంలో గణేషుడి విగ్రహ ఊరేగింపు చేపట్టారు. ఈక్రమంలోనే ఓ బాలుడు జెండా పట్టుకుని ఊపగా.. మార్గమధ్యలో కరెంట్ తీగలు తగిలాయి. షాక్ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా వాహనం నుంచి కిందపడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతడితోపాటు కిందపడ్డ మరికొందరు పిల్లలు గాయపడ్డారు.