వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు..

*నిమజ్జనంలో అపశృతి….*

వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు.

ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఆళ్లగడ్డలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు.

వారిలో ఇద్దరు తిరిగి పైకి ఎక్కగా శేఖర్ రెడ్డి అనే యువకుడు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

పోలీసులు శేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.