గని’ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది…!!!

టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది..

కిరణ్ కొర్రపాటి..దర్శకత్వంలొ…మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘గని’ సినిమాకు పాత టికెట్ ధరలే వర్తిస్తాయని… టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత టికెట్ రేట్ల ప్రకారం… మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ. రూ. 200 నుంచి రూ.250 ప్లస్‌ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో గరిష్టంగా రూ.150 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది…గని భారీ బడ్జెట్ చిత్రం కూడా కాదు కాబట్టి టికెట్ ధరల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గని సినిమాకు పాత టికెట్ రేట్లే వర్తిస్తాయని ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో వరుసగా ‘రాధేశ్యామ్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు భారీగా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇలా అయితే సామాన్యుడి జేబుకే చిల్లు ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ‘గని’ సినిమాకు టికెట్ ధరల పెంపు లేదని ప్రకటించడంతో సామాన్యులలో హర్షం వ్యక్తమవుతోంది.