క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌లకు చెక్ పెట్టేయండి ఇలా

గ్యాస్, కడుపులో మంటతో ఎక్కువమంది బాధపడుతుంటారు. టైంకు భోజ‌నం చేయ‌కపోవడం, కారం, మ‌సాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన‌డం… ఇలా కార‌ణాలు ఏమున్నా క‌డుపులో మంట‌, గ్యాస్ స‌మ‌స్య‌లు మ‌నల్ని బాధిస్తుంటాయి. అయితే ఇందుకోసం మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్తాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. అది ఎలాగో మీరే చూడండి…

Front Page


ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ తేనెను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని భోజ‌నానికి గంట ముందుగా లేదా భోజ‌నం చేసిన గంట తర్వాత తీసుకోవాలి. లేదంటే రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా తాగ‌వ‌చ్చు. దీంతో క‌డుపులో మంట‌, గ్యాస్ త‌గ్గుతాయి. ఆహారం కూడా జీర్ణ‌మ‌వుతుంది.

Front Page


ఆయుర్వేదంలో మజ్జిగను సాత్విక ఆహారంగా చెబుతారు. మీకు గ్యాస్‌ ఉన్నట్లు అనిపిస్తే ఒక గ్లాసు మజ్జిగను తాగండి. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ ఆమ్లతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అందులో నల్ల మిరియాల పొడి లేదా ఒక చెంచా కొత్తిమీర ఆకులను కలిపి తాగవచ్చు. ఇవి కూడా గ్యాస్ ను తగ్గిస్తాయి…

లవంగం కార్మినేటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో గ్యాస్ పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల భోజనం అనంతరం ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉండాలి.
https://r9telugunews.com.
జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర సహాయపడుతుంది. తిన్న తర్వాత జీలకర్ర గింజల పొడిని ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కలిపి తాగవచ్చు. లేదా ఒక టీస్పూన్ జీలకర్ర గింజలను ఒక కప్పు వేడి నీటిలో కలిపి తాగవచ్చు. ఎలా చేసినా గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

అరటి పండులో సహజ యాంటాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్‌, కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అసిడిటీని తగ్గించడానికి అరటి పండు చక్కని హోం రెమెడీ అని చెప్పవచ్చు. నొప్పిని నివారించడానికి ప్రతి రోజూ ఒక అరటిపండు తినవచ్చు..

క‌ప్పు నీటిని మ‌రిగించి అందులో 1 టీస్పూన్ అల్లం మిశ్ర‌మాన్ని వేయాలి. అనంత‌రం వేడి త‌గ్గించి సిమ్మ‌ర్‌లో 5 నిమిషాల పాటు ఉంచాలి. త‌ర్వాత ఈ ద్ర‌వానికి 1 టీస్పూన్ తేనెను క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ర‌చూ తీసుకోవాలి.