గాజాలో మళ్లీ బాంబుల వర్షం….

గాజాలో మళ్లీ బాంబుల వర్షం కురుస్తుంది. ఇజ్రాయిల్ మిలిటరీకి, పాలస్తీనా ఉగ్రవాదులకు జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు పసిపిల్లలు బలవుతున్నారు. తాజాగా ఇజ్రాయిల్ గాజా పై బాంబులు కురిపించడంతో 10 మంది మృతి చెందారు. వాళ్లల్లో 5ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ దుర్ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. తక్షణం గాజాపై బాంబు దాడులు నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదులు సుమారు 70 రాకెట్లను ఇజ్రాయిల్ పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. తాజాగా జరిపిన బాంబు దాడిలో ఐదేళ్ల చిన్నారి అలా కద్దుమ్ మృతి గాజాని మొత్తం కలచి వేసింది. తీవ్రగాయాలై కన్నుమూసిన ఆ పసిపాపను తండ్రి ఎత్తుకుని అంత్యక్రియలకు బయల్దేరుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

gaza-under-attack-by-israel-forces-