తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహాం…మ‌స్తు మ‌స్తుగా మ‌గాళ్ల పెండ్లి…సంగీత్‌ వగైరాలతో సందడిగా…..

R9TELUGUNEWS.COM.
తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహాం.

8 ఏళ్లుగా ప్రేమలో అభయ్, సుప్రియో

ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి.

సంగీత్‌ వగైరాలతో సందడిగా..

హాజరైన బంధువులు..*తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహం జరిగింది.* ||
తెలంగాణలో తొలి ‘గే’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్‌ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా తమలా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికే ఇలా చేశామని చెప్పారు….
హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహం జరిగింది.

మన దేశంలో స్వలింగసంపర్కం చట్టబద్ధత కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
దీంతో విదేశాల్లో తరహాలోనే మన దేశంలో కూడా ఈ గే వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి మెల్లగా తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది.

ఫలితంగా తెలంగాణాలో తొలి స్వలింగ సంపర్క వివాహం జరిగింది.

హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా సుప్రియో పనిచేస్తుంటే, అభయ్ మాత్రం సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు.
వీరిద్దరూ గత ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఆ తర్వాత వీరి అభిప్రాయాలు కలవడంతో వీరిద్దరూ ప్రేమించుకోవాలని నిర్ణయం తీసుకుని, తమ పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు