సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి గీతాంజలి బలి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి(28) అనే ఓ పేదింటి మహిళ తన కుటుంబం తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత ఇళ్లు ఉండాలనేది గీతాంజలి కల. ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలానే ఉంది. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చాకా.. గీతాంజలి కోరిక తీరింది. ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది. ఇదే సమయంలో తనకు జరిగిన మంచి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది. ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాజంలి వివరించింది. అలానే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది.

తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని టీడీపీ,జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు. ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు. టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదటలు పెట్టారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు. అర్థరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు. ఇలా సోషల్ మీడియాలో ఐ-టీడీపీ శ్రేణులు గీతాంజలిని మానసిక వేధింపులకు గురి చేసింది. వీళ్ల ట్రోల్స్ తట్టుకోలేక రైలు కిందపడి గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది.

ఐటీడీపీకి చెందిన సజ్జ అజయ్ అనే వ్యక్తి ఇళ్ల పట్టా పొందిన గీతాంజలని సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ శ్రేణుల ఆన్ లైన్ వేధింపులకు ఓ పేదింటి మహిల ప్రాణాలు పోవడమే కాకుండా ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలయ్యారు. తాను పొందిన మేలును చెప్పడమే ఆ మహిళా చేసిన తప్పా?. తనకు జరిగిన మంచిని సమాజానికి తెలియజేయడం తాను చేసిన నేరమా?. తన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న గీతాంజలి నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఎవరు. ఇలా మహిళలను, స్కూల్ పిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి అన్ని పలు మహిళా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు..