ఈటల గెలుపు కోసం కాగ్రెస్‌ అభ్యర్థిని బలి పశువును చేశారు…నైతిక విజయం తెరాస పార్టీదే…గెల్లు శ్రీనివాస్‌..

*నైతిక విజయం తెరాస పార్టీదే: గెల్లు శ్రీనివాస్‌*

R9TELUGUNEWS.COM: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెరాసకు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘నా గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా. ఎన్నికల్లో నైతిక విజయం తెరాస పార్టీదే. తెరాస ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈటల గెలుపు కోసం కాగ్రెస్‌ అభ్యర్థిని బలి పశువును చేశారు. ఓడిపోతే కుంగిపోమే.. గెలిస్తే పొంగిపోము. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. తెరాసను ప్రజలు ఆదరిస్తారని విశ్వాసం ఉంది. 2023లో హుజూరాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుంది. హుజూరాబాద్‌లో గెలిచిన ఈటలకు శుభాకాంక్షలు’’ అని గెల్లు శ్రీనివాస్‌ తెలిపారు..