ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు..మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి..

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అంద‌రి స‌ల‌హాలు స్వీక‌రిస్తాను అని పేర్కొన్నారు. న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తాను అని స్ప‌ష్టం చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూర‌మైన వెళ్తాను అని తేల్చిచెప్పారు. మేయ‌ర్‌గా, డిప్యూటీ మేయ‌ర్‌గా ఒకేసారి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని విజ‌య‌ల‌క్ష్మి పేర్కొన్నారు..