నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి ఈడీ ఎదుట హాజరు..!

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినవారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు గాలి అనిల్కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారిలో సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఈడీ తాఖీదులు అందుకున్నారు.