ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ మెయిల్స్ లో ఒకటి. అయితే వృత్తిపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కమ్యూనికేషన్ కోసం Gmail అకౌంట్స్ ను వినియోగిస్తున్నారు. ఈ మెయిల్ కు సంబంధించిన సందేశాలలోని డేటా మొత్తం Google క్లౌడ్ లో సేవ్ చేయబడుతుంది. కాబట్టి, ఇంటర్నెట్ లేకుండా మీ Gmail ఖాతాను యాక్సెస్ చేయలేరనే విషయం అందరికి తెలిసిందే.
కానీ, కొన్ని అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా Gmail ద్వారా సందేశాలను పంపడం సహా పొందేందుకు Google సంస్థ అనేక మార్గాలను వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండానే మీ Gmail ఎలా యాక్సెస్ చేయాలో కింద చెప్పిన ప్రక్రియను అనుసరించండి.
ఇంటర్నెట్ లేకుండా Gmail ఖాతాను వినియోగించడం ఎలా!!!!.
*** Google Chrome బ్రౌజర్ లో మీ Gmail ఖాతాను లాగిన్ చేయండి.
*** ఓపెన్ అయిన విండో కుడివైపున పై భాగంలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
***దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆల్ సెట్టింగ్స్ (all settings) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
*** ఆ తర్వాత ఓ పాప్ అప్ వస్తుంది. అందులో ఆఫ్ లైన్ పై క్లిక్ చేయాలి.
***ఆ వెంటనే ఆఫ్ లైన్ మెయిల్ వినియోగాన్ని ప్రారంభించేందుకు చెక్ బాక్స్ లో క్లిక్ చేయాలి.
***ఆఫ్ లైన్ లో సందేశాల కోసం మీ టైమ్ లైన్ ను ఎంచుకోండి. అందులో మీకు కావాల్సిన సందేశాలను ఎప్పుడెప్పుడు సెండ్ చేయాలో ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది.
***తర్వాత మార్చిన సెట్టింగ్స్ ను సేవ్ చేయండి.
ఈ ప్రక్రియ తర్వాత మీరు Google Chrome బ్రౌజర్ ను ఓపెన్ చేసి mail.google.comకి లాగిన్ అవ్వాలి. అలా చేసిన తర్వాత ఆఫ్ లైన్ ద్వారా కూడా మీ ఇన్ బాక్స్ లో మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ మెయిల్స్ ఆర్కైవ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే మార్గం ఉంది. అయితే మీ మెయిల్స్ ను ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసుకునేందుకు ఈ ప్రక్రియను ఫాలో అవ్వండి.
*** ఏదైనా బ్రౌజర్ లో myaccount.google.comని తెరిచి..
మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.
** మీ డేటాను బ్యాకప్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
*** డేటా డౌన్ లోడ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అలా మీ జీ మెయిల్ కు సంబంధించిన డేటాను