కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ మూవీ లో బిజీ బిజీ..!!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మరిపోయారు.. ఇటీవలే ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ ఇప్పుడు..
ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈసినిమాలో చిరంజీవి ఈ నెల 8 నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకోవడంతో ఆయన షూటింగ్‌‌లో పాల్గోనబోతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. నయనతార, సత్యదేవ్ తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 45 శాతం షూటింగ్ కంప్లీట్ తెలుస్తోంది..