భారీ వర్షాలకు గోదావరి ప్రవాహం ఉధృత..నీట మునిగిన ఆలయం..!

గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు(Heavy rains) నమోదు అవుతున్న కారణంగా పలు ప్రాంతాలను వరదనీరు ముంచేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ దేవాలయాన్ని
(Gandipochamma temple) వరుదనీరు చుట్టుముట్టింది. కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి ప్రవాహంతో నిండిపోయింది. బుధవారం ఉదయం నుంచి గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో అమ్మవారి ఆలయ మండపం పూర్తిగా నీటితో నిండటమే కాకుండా ఆలయంలోకి కూడా వరద నీరు వచ్చేసింది. దీంతో భక్తుల ప్రవేశాలను రద్దు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా ఆలయ సమీపంలోని స్థానిక దుకాణాలను ఖాళీ చేయించి మైదాన ప్రాంతాలకు తరలించారు….