రెండు కిలోల బంగారం పట్టివేత.విమాన క్యాటరింగ్‌ ఉద్యోగి అరెస్టు…బంగారం విలువ 1.09 కోట్లు…

R9TELUGUNEWS.COM. రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఓ వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు.

అతడి నుంచి రూ.1.09 కోట్ల విలువైన 2.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతడి వద్ద కిలో బరువు ఉన్న రెండు విదేశీ మార్క్‌ బంగారం కడ్డీలు, మరో రెండు బంగారం కడ్డీలు వంద గ్రాముల బరువు ఉన్నవి గుర్తించారు.

విమాన క్యాటరింగ్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి మిడిల్‌ఈస్ట్‌ నుంచి వచ్చే విమానాల ద్వారా ఈ బంగారాన్ని సేకరించినట్టు విచారణలో తేలింది.
ఆహారపదార్థాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయంలో వాటి మాటున ఇలా బంగారాన్ని తెచ్చినట్టు గుర్తించారు.
నిందితుడిని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్టు అధికారులు తెలిపారు.