సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత..!

సంగారెడ్డి జిల్లా..

జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆబ్కారీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు బాక్సుల్లో తరలిస్తున్న కేజీన్నర బంగారాన్ని పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కారులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది….