శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత…

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.725 కేజీల బంగారాన్ని మంగళవారం రాత్రి కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. దాంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇద్దరి వద్ద 1.725 కేజీల బంగారు నగలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్‌ చేశారు. కాగా, బహిరంగ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.72,55,069 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు…