కిర్లంపూడి మండలం,కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత…..!!!!

ప్రైవేటు బస్సులో 10 కిలోల బంగారం, 5.06 కోట్ల నగదు.. సీజ్ చేసిన పోలీసులు..

కిర్లంపూడి మండలం,కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత…

ప్రైవేటు బస్సులో 10 కిలోల బంగారం, 5.06 కోట్ల నగదు.. సీజ్ చేసిన పోలీసులు…

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా ,కిర్లంపూడి మండలం, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులకు అందిన సమాచారం ప్రకారం చేపట్టిన తనిఖీలలో భాగంగా భారీ స్థాయిలో బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం డిఎస్పి అరిటాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతి రావు కు అందిన సమాచారం ప్రకారం కిర్లంపూడి ఎమ్మార్వో మధ్యవర్తిత్వంతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేయగా విజయవాడ నుండి విశాఖపట్నం మీదుగా పలాస వెళ్లే పద్మావతి ట్రావెల్స్ కు సంబంధించిన ఒక బస్సులో సుమారు పది కేజీల పధి గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.ఈ బంగారం కొంతమేరకు ఆర్నమెంట్ వస్తువుల రూపంలోనూ, మరికొంత బిస్కెట్ రూపంలోనూ ఉందని తెలియజేశారు. అలాగే విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తున్న అదే పద్మావతి ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఉగాదికి తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం సెంటిమెంట్గా ఉండటం వలన బంగారం దుకాణాలలో లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులలో ఎటువంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారం, నగదు రవాణా అవడం చట్టరీత్యా నేరమని ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే బాధ్యులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోనూ..భారీగా నగదు పట్టుబడింది.

నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.4కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు. బస్సు సీట్ల కింద లగేజ్‌ క్యారియర్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు లెక్కించగా రూ.4.76కోట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతోపాటు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ తనిఖీలలో పాల్గొన్న జగ్గంపేట సిఐబి సూర్య అప్పారావు,కు కిర్లంపూడి ఎస్సై తిరుపతి రావు కు రివార్డులు అందేలా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబుకు సిఫార్సు చేస్తానని తెలియజేశారు. ఈ తనిఖీలలో విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందికి డి.ఎస్.పి అరిటాకులో శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు.