తగ్గిన బంగారం ధర..!. ఎన్నడూ లేనంతగా తగ్గిన ధర..!

ఇరాన్ అధ్యక్షుడి మృతితో అకస్మాత్తుగా పెరిగిన పసిడి ధరలు నేడు తిరిగి చల్లబడ్డాయి..నేడు ధరల్లో భారీ పతనం కొనసాగటం భారతీయ పసిడి ప్రియులను సంతోషానికి గురిచేసింది. దీంతో అనేక మంది మళ్లీ రేట్లు పెరగకముందరే షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేడు నిన్నటితో పోల్చితే రూ.6,000 క్షీణతను నమోదు చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు ధర.. చెన్నైలో రూ.6,860, ముంబైలో రూ.6,830, దిల్లీలో రూ.6,845, కలకత్తాలో రూ.6,830, బెంగళూరులో రూ.6,830, కేరళలో రూ.6,830, వడోదరలో రూ.6,835, జైపూరులో రూ.6,845, లక్నోలో రూ.6,845, నాశిక్ లో రూ.6,833, అయోధ్యలో రూ.6,845, బళ్లారిలో రూ.6,830, గురుగ్రాములో రూ.6,845, నోయిడాలో రూ.6,845గా కొనసాగుతున్నాయి..ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.6,500 భారీ క్షీణతను నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగారాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7,484, ముంబైలో రూ.7,451, దిల్లీలో రూ.7,466, కలకత్తాలో రూ.7,451, బెంగళూరులో రూ.7,451, కేరళలో రూ.7,451, వడోదరలో రూ.7,456, జైపూరులో రూ.7,466, లక్నోలో రూ.7,466, నాశిక్ లో రూ.7,454, అయోధ్యలో రూ.7,466, బళ్లారిలో రూ.7,451, గురుగ్రాములో రూ.7,466, నోయిడాలో రూ.7,466గా ఉన్నాయి..ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,830గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,451 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,900 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది…