తగ్గిన బంగారం ధర…..!!!!

రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా..గత కొద్ది రోజులుగా బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ధర రూ.1,750 తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,600 తగ్గింది. మార్చి 11న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,750కు పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,580కు చేరింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 తగ్గడంతో.. మార్కెట్లో ధర రూ. 48,200గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు కూడా ఈ రోజూ భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 తగ్గడంతో.. ఒక కిలోకు రూ. 74,100గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,290 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,580గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,600లుగా ఉంది.