సముద్రం అడుగున రూ.1.32 లక్షల కోట్ల బంగారం..!!

మా సరిహద్దుల్లో ఉంది కాబట్టి మా అదే నటన శ్రీలంక..

వెలికితీయడం పెద్ద సవాల్..

నిధికి సంబంధించిన కొలంబియా మరో రెండు నౌకలను గుర్తించింది….

సముద్ర గర్భంలో రూ.1.32 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. 1708లో జరిగిన యుద్ధంలో స్పెయిన్కు చెందిన జాన్ జోస్ అనే నౌకా బ్రిటిష్ దాడుల్లో కొలంబియా తీరంలో మునిగింది. అందులో 600 మంది ప్రయాణికులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు ఉన్నాయి.2015లో అనేక శిథిలాలను కొలంబియా ప్రభుత్వం గుర్తించి పరిశోధన జరిపింది. తాజాగా ఆ నౌక తో పాటు మరో రెండు నౌకలను గుర్తించింది. ఈ దృశ్యాలను విడుదల చేశారు…!!సుమారు 3100 అడుగుల లోతున ఈ సంపద ఉన్నట్టు ఆర్మీ తెలిపింది. 1708లో స్పెయిన్‌కు చెందిన శాన్ జోస్ అనే నౌకపై బ్రిటీష్ నావలు దాడి చేయడంతో అది నీట మునిగింది. అపారసంపదతో నౌక స్పెయిన్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఆ సమయంలో నౌకలో ఉన్న 600 మందిలో అతి కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నౌక శిథిలాలను 2015లోనే గుర్తించగా.. కొలంబియా ప్రభుత్వం నాటి నుంచి శిథిలాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తోంది. తాజాగా రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించగలిగే అత్యాధునిక వాహనాలతో సముద్రలోతుల్లోకి వెళ్లి పరిశీలించగా ఈ నిధినిక్షేపాలు బయటపడ్డాయి. శాన్ జోస్‌తో పాటూ ఆ ప్రాంతంలో నీటమునిగిన మరో రెండు నౌకలను కూడా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.. తీర ప్రాంతంలో లభించిన సంపదపై తమకే హక్కు ఉంటుందని కొలంబియా ప్రభుత్వం అంటోంది. దీన్ని కొలంబియా సాంస్కృతిక వారసత్వ సంపదగా ప్రభుత్వం పరిగణిస్తోంది. కాబట్టి.. వీటిని అమ్మడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. మరోవైపు.. స్పెయిన్ ప్రభుత్వం ఈ సంపద తమకే చెందాలని పట్టుబడుతోంది. ఇది స్పెయిన్ రాజుకు చెందిన నావలోని సంపద కాబట్టి తమకే దీనిపై హక్కు ఉంటుందనేది స్పెయిన్ వాదన. మరోవైపు.. బొలీవియాకు చెందిన ఆదివాసీలు కూడా ఈ నిధినిక్షేపాలు తమవేనని చెబుతున్నారు. అప్పట్లో స్పెయిన్ రాజు తమ పూర్వీకులతో బలవంతంగా ఈ సంపదను వెలికితీయించారన్నారు. ఇక.. ఈ నిధిని వెలికితీయడం సాంకేతికకంగా పెను సవాలేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ నౌకాశిథిలాలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయడమే తమ అభిమతమని కొలంబియా అధికారులు చెబుతున్నారు. కొలంబియాకే కాకుండా కరీబియన్ ప్రాంతానికి యావత్ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు. ..