మే రెండవ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 151,810 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 139,159 పలుకుతోంది. 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 113,858 పలుకుతోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు రాబోయే రెండు నుండి మూడు నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, 3,450 డాలర్ల నుండి 4,100 డాలర్ల శ్రేణిలో కదలాడవచ్చని ప్రముఖ కమోడిటీ నిపుణులు అజయ్ కేడియా పేర్కొన్నారు. ఆ తర్వాత ఇది మరో భారీ పెరుగుదలను నమోదు చేసి, 8,000 డాలర్ల స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. విశేషమేమిటంటే, భారతదేశంలో బంగారం తన చారిత్రక గరిష్ట స్థాయిని జనవరి 2026లో నమోదు చేసింది; ఆ సమయంలో, 10 గ్రాముల బంగారం ధర రూ. 1.83 లక్షల స్థాయిని తాకింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.