పెరిగిన బంగారం, వెండి ధరలు…

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది..రోజు రోజుకు కొనుగోలుదారులకు పసిడి, సిల్వర్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి ధర పెరిగింది. దీంతో వినియోగదారులు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దసరా, దీపావళి పండగ సీజన్‎లో కనిష్టాలకు చేరిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు రెక్కలు వచ్చినట్లు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.1000 వరకు పెరిగింది గోల్డ్. ఇక హైదరాబాద్‎లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో నేడు (ఆదివారం) బంగారం ధర పెరుగుదలతో రూ.52 వేల మార్క్‎ను తాకింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కూడా రూ.400 పెరిగి రూ.56,730 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే దూసుకుపోతుంది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.750 పెరిగి రూ.72,750కి చేరుకుంది. ఢిల్లీలో వరుసగా 3 రోజుల్లోనే రూ.1,250 పెరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే..కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.1000 పెరిగి రూ.75వేల మార్క్‎ను(Mark) క్రాస్ చేసింది. అయితే..స్థానికంగా చూసినట్లయితే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఇక వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి లుక్కేద్దామ్..

ప్రధానమైన నగరాల్లో బంగారం ధరలు

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,960గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,770 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం పసిడి రేట్ రూ.52,050 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.56,780గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.52,000 ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ.56,730 వద్ద కొనసాగుతోంది.

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,000గా కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,000గా కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.56,730 ఉంది.

విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.52,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ.56,730 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,750

ముంబైలో కిలో వెండి ధర రూ.72,750

హైదరాబాద్‎లో కిలో వెండి ధర రూ.75,000

విజయవాడ‎లో కిలో వెండి ధర రూ.75,000

విశాఖ‎లో కిలో వెండి ధర రూ.75,000గా కొనసాగుతోంది….