దిగివస్తున్న బంగారం, వెండి ధరలు…

బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం, వెండి రెండింటి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిధ దేశాల మధ్య పరిణామాలు అన్నీ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే బంగారం ధర రోజురోజుకీ మారుతుంటోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మొన్నటి నుంచి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరల్ని ఓసారి పరిశీలిద్దాం.దేశ రాజధాని ఢిల్లీలో(Delhi 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల100 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయGold Rate)లుంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Silver Price) ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి 61 వేల 100 రూపాయలు కాగా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది. కేరళలో కిలో వెండి 63 వేల 3 వందల రూపాయలుంది.