నిజాయితీ చాటిన కోదాడ ఎమ్మెల్యే గన్ మెన్..!..

నిజాయితీ చాటిన కోదాడ పోలీస్..
సూర్యాపేట జిల్లా..

హుజూర్నగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా కార్ నుండి బ్యాగు జారిపడి పోవడం తో కోదాడ లో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గన్మెన్ ఎరగాని గోవిందు గౌడ్ కు ఆ బ్యాగు దొరకడం జరిగింది… ఆ బ్యాగులో సుమారు రెండున్నర లక్షల రూపాయల నగదు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.. బ్యాగ్ లోనే బాధితుడు వివరాలు ఉండడంతో అతనికి కాల్ చేసి బ్యాగ్ తనవద్ద ఉందని వారికి సమాచారం తెలియజేశారు..
దీంతో బ్యాగ్ పోయిందని ఆందోళన చెందుతున్న వారికి ఒకసారిగా సంతోషం వ్యక్తం చేశారు.. దీంతో బాధితుడు గోవిందు ను అభినందించారు.. నిజాయితీగా తన బ్యాగుని తనకిచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు… డ్యూటీ విషయంలో చాలా నిజాయితీగా పనిచేస్తారని గోవింద్ స్నేహితులు అభినందించారు….