విదేశాల నుంచి అక్రమంగా చీర రూపంలో బంగారం రవాణా….

విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించే వారు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో హీరోల మాదిరి రకరకాల వేశాలు మార్చి అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. తాజాగా.. ఇలాంటి ఘటనే శంషాబాద్ ఎయిర్‌పోస్టులో చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి 461 గ్రాముల బంగారంతో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చీర రూపంలో ఈ బంగారాన్ని తీసుకుని రావటం. అనుమానంతో అధికారులు తనిఖీ చెయ్యగా ఈ బంగారం చీర దొరికింది. బంగారాన్ని లిక్విడ్‌గా చేసి దానిని చీరపై స్ప్రే చేసి సదరు వ్యక్తి తెచ్చినట్టు అధికారులు చెప్పారు. ఈ బంగారం విలువ 28 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..
అయితే ఇప్పటి వరకు బూట్లు, షరీర భాగాలు, శరీరంలో, కుక్కర్‌లు ఇలా వస్తువుల రూపంలో ఒక దేశం నుంచి మరో దేశానికి కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పి విమానాల్లో తరలిస్తున్నారు. ఇదే విధంగా దుబాయ్(Dubai) నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు బంగాన్నిఏకంగా చీరగా (Gold Saree)మార్చి గోల్డెన్ శారీగా పట్టుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు (Customs officials)పట్టుకున్నారు. పట్టుబడిన గోల్డెన్ శారీ ఖరీదు 28లక్షల రూపాయలు(28 Lakhs) చేస్తుందని అధికారులు తెలిపారు..