అడ్రస్ కొసం గూగుల్ మ్యాప్ ను నమ్మి ఎస్ఐ పరీక్ష పోతే.. పరీక్ష గోవిందా..!!

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

ఎంతో కాలంగా కష్టపడి కోచింగ్ తీసుకొని, నోటిఫికేషన్ విడుదల కాగానే సంతోషంతో.. ఎంతో ఉత్సాహంగా పరీక్ష కేంద్రంకు వెళ్లాలనుకున్న ఓ నిరుద్యోగి షాక్ తగిలింది… గూగుల్ మ్యాప్ నమ్మి సరైన సమయానికి ఓ స్కూల్ వద్దకు వెళ్ళగా అక్కడే వెళ్లిన తర్వాత అడ్రస్ తప్పని షాకింగ్ న్యూస్ తెలిసింది…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్.ఐ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో పరీక్ష కు అనుమతించని అధికారులు…

కోదాడ పట్టణములోని ఎస్.ఆర్.ఎం స్కూల్ సెంటర్ లోకి అనుమతించని అధికారులు..

గూగుల్ మ్యాప్ లో కోదాడ లో ఉన్న మరొక ఎస్.ఆర్.ఎం స్కూల్ చూపించడంతో 10నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి…

పాలకిడు మండలం కోమ్మటికుంట గ్రామానికి చెందిన కృష్ణ జయదేవ్ గా గుర్తింపు… తనకు జరిగిన ఇబ్బందిని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వ రూల్ ప్రకారం ఒక నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షకు అనుమతించకూడదని నిబంధనల ప్రకారం ఆ నిరుద్యోగికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు…

భవిష్యత్తుని నిర్ణయించే పరీక్షలకి ఓ పావుగంట ముందే ఉండాలే కానీ ఇలా మ్యాపులు నమ్ముకుని వస్తే ఇలానే జరుగుతుందని అధికారులు తెలిపారు..