హీరో నంద‌మూరి బాల‌కృష్ణ సూచించిన టైటిల్‌తో హీరో గోపీచంద్ 30వ చిత్రం ఖ‌రారైంది.

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ సూచించిన టైటిల్‌తో హీరో గోపీచంద్ 30వ చిత్రం ఖ‌రారైంది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని చిత్ర బృందం శ‌నివారం వెల్ల‌డించింది. ల‌క్ష్యం, లౌక్యం చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్‌, ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్ర‌మిది. ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్ద‌రూ ఈ చిత్రంలో గోపీచంద్‌కి అన్నావ‌దిన‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ చిత్రానికి హీరో బాల‌కృష్ణ టైటిల్ సూచించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఫ్యామిలీ ఎమోష‌న్ల‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళిత‌మై ఉన్న త‌మ చిత్రం బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందుతోంద‌ని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.