షాకింగ్ న్యూస్…. ఒక డ్యాం వల్ల రోజు పెరిగింది..!!భూమి వేగం తగ్గింది.!

ప్రపంచం లోని అతి పెద్ద ఆనకట్ట:::త్రీగోర్జెస్ డ్యాంకు సంబంధించిన విశేషాలు..

ఒక డ్యామ్.. భూమిని స్లో చేసింది.

ప్రపంచంలోనే అతి భారీగా..


ప్రపంచం లోని అతి పెద్ద ఆనకట్ట:::త్రీగోర్జెస్ డ్యాంకు సంబంధించిన విశేషాలు..


చైనాలోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ను నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యామ్..

డ్యాం…
ప్రపంచంలోని అతి పొడవైన రెండవ(6,000 km) నది..యాంగ్జీ పై నిర్మితమైనది (మొదటిది నైలు నది)
***1940 లొ తలచినా ఈ ప్రాజెక్టు కార్యాచరణను ప్రారంభించినది మాత్రం…1994 లో…దీనిని పూర్తి చేసినది 2009 లో…

***13 నగరాలు, 140 పట్టణాలు, 1,600 పల్లెల పైగా నిరాశ్రయులయ్యారు…ఈ డ్యాం వలన నిరాశ్రయులైన వారు 1.6 to 1.9 మిలియనుల మంది…

***2009 తర్వాత ఈ ఆనకట్ట గరిష్ట నీటి మట్టం 185 meters..

***చైనా లోని 22 కౌంటీలు పాక్షికంగా నీట మునిగాయి..80% భూభాగం నీట మునిగింది మాత్రం సిచువాన్ కౌంటీ..(అంటే 80% రాష్ట్రం నీటిలో మునిగిందన్నమాట)..

*** దేశానికి చెందిన 25% సారవంతమైన భూమి నీట మునిగింది….

40 శాతం మంది రోడ్డున పడ్డారు..

నలభై శాతం గ్రామీణ ప్రజలు తమ ఆవాసాలను, భూమి ని కోల్పోయి జీవనోపాధిని కోల్పోవలసి వచ్చింది… డ్యామ్ కోసం ఈ స్థాయిలో ప్రజలని రోడ్డు మీద పడటం కూడా కొన్ని విమర్శలకు దారితీసింది.. కానీ చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ఛానల్ లో కూడా కథనాలు ప్రచురించడం సాధ్యం కాదు..!!

(విద్యుత్ కాంతులు).. ఈ డ్యాం పూర్తి చేయటం వలన దేశ జాతీయ విద్యుత్ శక్తి లో వృద్ధి లోకి వచ్చిన విద్యుత్ శక్తిమిగులుపదిశాతం…

***డ్యాం కట్టక ముందు వచ్చిన వరదల వలన 3,20,000 మంది చనిపోయారు…

*** డ్యాం కట్టిన తర్వాత ప్రాణ నష్టం తగ్గినట్లేనని భావించినా.2010లో సంభవించిన వరదలు అపారప్రాణ , ధన నష్టాన్ని మిగిలించింది…

***డ్యాం కట్టడానికి అయిన వ్యయం…
200-240 బిలియన్ యువాన్లు , = 25 బిలియన్ అమెరికా డాలర్లు…

భూమిని స్లో చేసింది..

***చాలా ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశంలో నీటిని నిలువ ఉంచడం వలనచాలా స్వల్ప ప్రమాణంలో భూభ్రమణ వేగం తగ్గుదల ఉందని ఒక వాదన…2.33 కిలోమీటర్ల పొడవునా 181 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీనితో 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుందని అంచనా.

రోజు పెరిగింది..

భారీ డ్యామ్, రిజర్వాయర్లో నిలిచే నీటి బరువు ఓవైపు.. డ్యామ్ నుంచి విడుదలయ్యే నీరు 150 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంటే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్ప డిందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భూమి భ్రమణవేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని.. రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు. అంతేకా దు ఈ భారీ డ్యామ్ వల్ల.. భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఏమిటీ ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’?

వేగంగా, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు జడత్వం (ఇనెర్షియా) నెలకొని.. సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి.. భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి పొరల కదలికలు కూడా ప్రభావితమయ్యాయని, చిన్న స్థాయిలో భూకంపాలు వస్తున్నాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ డ్యామ్ను పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు.

త్రీగోర్జెస్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్.. భూమ్మీద మనుషులు నిర్మించిన డ్యామ్లలో అదీ ఒకటి అంతేకదా అంటారా.. కాదు.. అది అన్నింటిలో ఒకటి కాదు.. ఏకంగా భూమి తిరగడాన్నే స్లో చేసేసింది..

ఇన్ని వాదనల మధ్య ప్రతికూల-సానుకూల దృక్పథంతో నిర్మించిన ఈ ఆనకట్ట వలన 1. నీళ్ళు లేని ఉత్తర చైనాకు దక్షిణ చైనానుండి మంచినీటిని తీసుకు వెళ్ళటం సాధ్యమైనది..
2. అతి తక్కువ ఖర్చుతో ఉత్పాదకత సాధ్యమైంది…
3. అందువల్ల సంవత్సరానికి మూడు పంటలు సాధ్యమైనవి…
4. కరెంటు కోతలేకుండా నిరంతరాయ విద్యుత్ ఇవ్వడం సాధ్యమయినది…