గోవాలో హంగ్…సర్కారు ఏర్పాటు దిశగా బీజేపీ… సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న బీజేపి ఎమ్మెల్యే లు….

గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లను లాక్కోగలిగితే గోవాలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది…ఈ నేపథ్యంలో గోవా బీజేపీ నేతలు స్పందిస్తూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు మరో ముగ్గురి మద్దతు ఉందని, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఈ సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. బీజేపీ నేతలు చెపుతున్న ముగ్గురు నేతల్లో ఆంటోనియా వాస్, చంద్రకాంత్ షెట్యే, అలెక్స్ రెజినాల్డ్ ఉన్నారు. ఆంటోనియా వాస్ గెలుపొందినట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.