కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం

కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు 2 నిమిషాలపాటు ఎక్కడివారు అక్కడే పనులు, కదలికలు ఆపేయాలని కేంద్రం సూచించింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా కేంద్రం ఇటువంటి నిర్ణయాలే తీసుకున్నది. క్యాండిల్స్ వెలిగించడం, చప్పట్లు కొట్టడం వంటి వాటిని అమలు చేసింది. అయితే అప్పట్లో వీటిపై విమర్శలు వచ్చాయి. కానీ, ప్రతి ఒక్కరు పాటించారు. మరి ఈరోజు కూడా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలపాటు దేశంలోని ప్రజలు రెండు నిమిషాలపాటు మౌనం పాటిస్తారా చూడాలి.