మరోసారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్..కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తుల తరలింపు.నిలిచిన ప్రాణం…

కిమ్స్‌కు గుండె, ఊపిరితిత్తుల తరలింపు..
గ్రీన్ ఛానెల్ ఏర్పాటుతో నిలిచిన ప్రాణం..

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను మరొకరికి అమర్చేందుకు హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మలక్‌పేట యశోదా ఆస్పత్రి నుంచి గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 11 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో ఓ వ్యక్తి ప్రాణం నిలిచింది. అత్యవసర సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఈ ఏడాది.. ఇప్పటివరకూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవయవ రవాణాను సులభతరం చేసేందుకు 30 సార్లు గ్రీన్ ఛానెల్స్‌ ఏర్పాటు చేశారు..