గ్రూప్ వన్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్..

గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పేపర్ రద్దు పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 24 గంటల్లోనే లక్షా 60 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీంతో ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ… గ్రూప్ వన్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.