గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా…!

*గోవుతో గృహప్రవేశం*

*గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా…!!*

మన దేశ హైందవ సాంప్రదాయంలో గృహ ప్రవేషం అనేది పెద్దవేడుక. అందులో ఒకప్పుడు రెండు రకాలుగా గృహప్రవేశాలు జరుపే ఆచారం ఉండేది.

దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. దురదృష్టవశాత్తూ గత 800 సంవత్సరాలుగా పలుకారణాల వల్ల ఈ ఆచారం పూర్తిగా దెబ్బతిన్నది. ఎదో ఒకరోజు అంటూ గృహప్రవేశం చేయించుకుంటున్నవారు కూడా ఏదో మొక్కుబడిగా చేయించుకుంటున్నారు.., దాని ప్రాముఖ్యత తెలిసి కాదు…..

జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది… గృహప్రవేశం చేయాలనే ఆలోచన కూడా అందరికీ ఉంటుంది కానీ అదే సందర్భంలో డబ్బులు ఎంత ఖర్చయిపోయాయి గృహప్రవేశానికి ఎలా చేయగలం అనే ఓ పెద్ద అనుమానం కూడా మనసు లోనే ఉంటుంది… వీడు ఎలాగైతే నిర్వహిస్తున్నాము గృహప్రవేశానికి కూడా అదే తంతుగా అన్ని ఆచారాలతో జరిపించాలి..

*సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు.*

*సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తారు.*

*లేదంటే ఆ ఊరికి తాము పరాయివాళ్ళం అనే భావన కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.*

*ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి ‘గృహప్రవేశం’ చేస్తుంటారు.

* ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకువెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు.

*ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది.

*గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహాల్లోకి గోవును తిప్పటం అనేది శుభసూచకంగా విశ్వసిస్తుంటారు.

*నూతన గృహంలో గోవు మూత్రం … పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అదే బహుళ అంతస్తుల్లో గృహప్రవేశం చేసినప్పుడు గోవును బహుళ అంతస్తుల్లో తిప్పటం కుదరదు.

*కాబట్టి ఆ ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజ చేయాలి. అలాగే గోవు పేడను .మూత్రాన్ని ఇల్లంతా చిలకరించాలి…