గృహ లక్ష్మీ పథకం – నియమ నిబంధనలు..

గృహలక్ష్మి ఇంటిని మహిళ పేరిటే మంజూరు చేస్తారు..

ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖాళీ స్థలం లబ్ధిదారులు లేదా కుటుంబ సభ్యుల పేరున ఉండాలి..

లబ్ధిదారులు లేదా ఆ కుటుంబ సభ్యుల పేరిట ఆహార భద్రతా కార్డు ఉండాలి…

లబ్దిదారులు తనకు నచ్చిన డిజైన్‌లో ఇంటిని నిర్మించుకోవచ్చు..

ఈ పథకం రెండు పడకల ఆర్సీసీ ఇంటి నిర్మాణానికే వర్తిస్తుంది…

లబ్ధిదారులు అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి దీనికై ఆధార్‌/ఓటర్‌ ఐడీకార్డులు కలిగి ఉండాలి…

ఇప్పటికే ఆర్సీసీ రూఫ్‌తో కూడిన ఇల్లు ఉన్నా, జీవో 59 కింద లబ్ధి పొందినా ఈ పథకం వర్తించదు..

ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ, మైనార్టీలు కలిపి 50 శాతం ఉండాలి..

మొత్తం లబ్ధిదారుల్లో ఐదు శాతం వికలాంగులు అయి ఉండాలి..

*ఇందుకు అవసరమగు సమాచారం వివరాలు*

1.లబ్ధిదారుల పేరు
2. భర్త పేరు
3.కులం
4.ఆధార్ కార్డు
5.ఫుడ్ సెక్యూరిటీ( రేషన్) కార్డు
6. వికలాంగులా అయితే సదరం సర్టిఫికెట్
7. ఫోన్ నెంబర్.