గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత…!

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు అస్వస్థత.

తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.

వెంటనే అప్రమత్తమై సపర్యలు చేసి, వైద్యులకు సమాచారం ఇచ్చిన గన్ మెన్లు.

ఇంట్లో నుండి పార్టీ నాయకులను పంపించేసిన గన్ మేన్లు.

ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికు సైలెన్ ఎక్కిస్తున్నా వైద్యులు.

అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్ మెన్లకు తెలిపిన వైద్యులు.

విషయం తెలుసుకొని హైదరాబాద్ నుండి గుడివాడ బయలుదేరిన కొడాలి నాని కుటుంబ సభ్యులు.

ఆందోళనలో గుడివాడ వైకాపా శ్రేణులు….

అయితే గత కొన్ని నెలల నుంచి కొడాలి నాని ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా హైదరాబాదులో పలు రకాల చికిత్సలు కూడా చేయించుకున్నప్పటికీ కొడాలి నాని కి ఆరోగ్యం సెట్ కాలేదని సమాచారం. మరి కొడాలి నాని ఆరోగ్యం పైన కుటుంబ సభ్యులు లేదా ఆయనే డైరెక్ట్ గా స్పందిస్తుందేమో చూడాలి మరి. గత కొన్ని నెలలుగా ఎలక్షన్ సమయం కావడం చేత ఎక్కువగా తిరగడం ఆలోచించడం వంటివి చేయడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్య వచ్చిందని సమాచారం. ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ముందుకు వెళుతున్నారు నాని. మరి ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయి…