గుజరాత్ లో 16 గంటల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం..!

ఇటీవల వాతావరణ మొత్తం కూడా చాలా వేడిగా ఉండడం ఏలినో ప్రభావంతో వర్షపాతం కూడా తగ్గడం జరుగుతోంది.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన దేశ ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ, గుజరాత్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది… కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరికొన్ని రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది..అక్కడ వర్షం కురిస్తే అది కుంభవృష్టే అవుతోంది. రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేస్తోంది. ప్రధానంగా వల్సాద్‌ జిల్లాలోని ఉమేర్‌గావ్‌ తాలూకాలో 16 గంటల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, ఇతర తాలూకాల్లో కూడా 600 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురిశాయి. సూరత్, నౌసారీ, దాన్స్, తాపీ వంటి జిల్లాలకు అధికారులు ఇవాళ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాపి పరిసర ప్రాంతాల్లో 200కు పైగా కార్లు మరియు వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి, దీంతో స్థానిక పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు.
https://x.com/i/status/2080471356190437672
వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం, రాజధాని అహ్మదాబాద్‌తో పాటు గాంధీనగర్, క్రీడా, ఆనంద్, వడోదర, భరోజ్, సబర్కాంత్, మహాసన, పఠాన్ మూర్తి, జాంనగర్, ద్వారకా, రాజ్ కోట్, పోర్ బందర్, జునాగఢ్, భావనగర్, ఆమ్రేలి వంటి వివిధ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా అహ్మదాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖను అప్రమత్తం చేసింది మరియు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకూడదని సూచించింది..దాదాపు 250 తాలూకల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా 19.96 అంగుళాల వర్షపాతం నమోదైంది, అహ్మదాబాద్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. వాస్న బ్యారేజీ నుండి నీటిని సబర్మతి నదిలోకి విడుదల చేశారు. అర్ధరాత్రి సమయంలో వర్షపాతం కొంత తగ్గుముఖం పట్టడంతో, వాహనాల రాకపోకల నిమిత్తం అన్ని అండర్ పాస్‌లను తిరిగి తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల నదులు, డ్యామ్‌లు, జలశయాల్లో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతున్నాయి. అపార్ట్‌మెంట్ల వద్ద పార్క్ చేసి ఉంచిన కార్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. నివాస ప్రాంతాలలో కూడా వరదలు చెరువులను తలపిస్తూ, నీటి ప్రవాహం అత్యంత ఉధృతంగా కొనసాగుతోంది…. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమై నిత్యవసర వస్తువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది..

భారీగా ముంపు.. ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి!

వరద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. సూరత్ ప్రాంతం నుంచి దాదాపు 1,500 మందిని, నవ్సారి జిల్లా నుంచి 200 మందిని, ఇతర ముంపు ప్రాంతాల నుంచి మొత్తం 1,200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావేరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నవ్సారి జిల్లాలోని 11 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి పూర్తిగా నీట మునిగాయి. క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్, స్థానిక పోలీసులు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు..