ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు…

*ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు..

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.. ప్రధాని అయ్యాక కూడా ఆయన రూట్స్ ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని నరేంద్ర మోడీ చాలా సార్లు చెప్పారన్నారు.

మనం ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదన్నారు గులాంనబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీలోని లోపాలను ఎత్తిచూపిన ఆజాద్..
ఈ మధ్యే రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు.. ఇక, గ్రూప్ -23 నాయకులలో ఒకరైన ఆజాద్.. ఇప్పుడు ప్రధానిపై ప్రశంసలు కురిపించడం చర్చగా మారింది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సభలో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూపై వ్యాఖ్యలు చేశారు ..విశేషమేమిటంటే, గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనను రాజ్యసభలో ప్రశంసించారు మరియు ఆయనకు సంబంధించిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక, ఈ ప్రశంసల వెనుక మతలు ఏంటైనా ఉందా? అనే చర్చ సాగగా… కశ్మీర్‌లు మంచు ఎప్పుడు నల్లగా కురుస్తుందో అప్పుడు నేను బీజేపీలో చేరతానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.