గుంటూరు కారం మూవీ రివ్యూ..!

గుంటూరు కారం మూవీ రివ్యూ

నటీనటులు: మహేష్ బాబు – రమ్యకృష్ణ – శ్రీలీల – ప్రకాష్ రాజ్ – జయరాం – మీనాక్షి చౌదరి – మురళి శర్మ – జగపతిబాబు – వెన్నెల కిషోర్ – రావు రమేష్ – రఘుబాబు – ఈశ్వరీ రావు – రాహుల్ రవీంద్రన్ తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస

నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ

రచన- దర్శకత్వం: త్రివిక్రమ్.
మహేష్ బాబు – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం..
కథ:

వెంకట రమణ (మహేష్ బాబు) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. అతడి తండ్రి (జయరాం) ఒక హత్య కేసులో జైలుకు వెళ్తే.. తల్లి (రమ్యకృష్ణ) మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తన తండ్రి సొంతూరు గుంటూరులో మేనత్త మావయ్యల దగ్గర పెరిగిన రమణ.. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి సమయంలో తల్లి నుంచి రమణకు పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఆమె ఆస్తి నుంచి వాటా లేదు అని సంతకం పెట్టించుకోవడానికి అని తెలుస్తుంది. మరి రమణ సంతకం పెట్టాడా.. ఈ పంచాయతీ ఎక్కడిదాకా వెళ్ళింది.. ఈ తల్లి కొడుకుల బంధం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ…
ఇక సెకండాఫ్‌లో రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్లర్లతో డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్‌గా ఉంది. ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాకు మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేస్తాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలెట్. ఇక ప్రకాశ్ రాజ్.. రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్లు కథను మలుపుతిప్పేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఫైనల్‌గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ముగుస్తుంది…

ఎవ్వరూ పాత్ర ఎలా..!

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికే వస్తే.. మహేష్ బాబు కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్‌కు మహేష్ టైమింగ్ బాగుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్, చేసిన రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా శ్రీలీలతో కెమిస్ట్రీ బ్రహ్మండంగా స్క్రీన్‌పై పండింది. రమ్యకృష్ణ, రావు రమేష్, జయరాం, జగపతి బాబు పాత్రల నిడివి తక్కువగా ఉన్న వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీనాక్షి, అజయ్, అజయ్ ఘోష్, రవిశంకర్, బ్రహ్మాజీ ఇలా ప్రతీ పాత్ర కూడా ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు…

గుంటూరు కారం సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోకపోగా, ట్రోలింగ్ స్టఫ్‌గా మారాయి. కానీ ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా చేశారు. ఇక మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ సీన్‌ను రిచ్‌గా మార్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నాయి…
మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, శ్రీలీల డ్యాన్సులు, గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు మరో బలమైన అంశాలుగా కనిపిస్తాయి. పంచ్ డైలాగ్స్, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉంటాయి. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఎలాంటి సందేహాలు లేకుండా థియేటర్లోనే చూడాలి. ఫ్యాన్స్ కీ మాత్రమ్ ఫుల్ జోష్ అనిపిస్తుంది..